బాంబు బెదిరింపు హెచ్చరికలతో ముంబయి నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా లండన్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
అమెరికా న్యూజెర్సూలోని న్యూవార్క్‌కు వెళ్లాల్సిన ఏఐ 191 విమానాన్ని బాంబు బెదిరింపు కారణంగా లండన్‌లోని స్టాన్స్టెడ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. ఈ సమయంలో యూకే రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన టైఫూన్ యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి.
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
ముంబై నుంచి న్యూవార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. వెంటనే లండన్ స్టాన్స్టెడ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బెదిరింపు వార్తలు తప్పని తేలింది. తిరిగి విమానం గమ్యస్థానానికి విమానం బయలుదేరింది.
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
బాంబు బెదిరింపు వార్తలు అబద్ధమని తేలాక.. ఏఐ 191 విమానం తిరిగి న్యూవార్క్‌కు బయలుదేరిందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: ఉన్నావ్ జైలులో ఖైదీల చేతుల్లో తుపాకులు