తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పైలట్​కు కరోనా.. దారిలోనే వెనక్కి మళ్లిన విమానం!

air india
ఎయిర్​ఇండియా

By

Published : May 30, 2020, 2:18 PM IST

Updated : May 30, 2020, 2:59 PM IST

14:51 May 30

దిల్లీ నుంచి మాస్కోకు బయల్దేరిన ఎయిర్​ఇండియా విమానాన్ని మధ్యలోనే వెనక్కి మళ్లించారు. విమానంలోని ఓ పైలట్​కు కరోనా సోకినట్లు తెలియడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

"వందేభారత్​ మిషన్​లో భాగంగా మాస్కోలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకురావడానికి ఏ320 విమానం బయల్దేరింది. విమానం ఉజ్బెకిస్థాన్​ గగనతలంలోకి ప్రవేశించిన సమయంలో పైలట్​కు కరోనా పాజిటివ్​గా తేలిన విషయాన్ని గ్రౌండ్ సిబ్బంది గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి తీసుకురావాలని పైలట్లను కోరాం. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు విమానం దిల్లీకి చేరుకుంది."

-ఎయిర్​ఇండియా సీనియర్ అధికారి

విమానంలో ఉన్న సిబ్బందిని క్వారంటైన్​కు తరలించినట్లు అధికారులు తెలిపారు. భారతీయులను వెనక్కి తెచ్చేందుకు మరో విమానాన్ని మాస్కోకి పంపినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:విదేశీ వ్యవహారాల శాఖలో కరోనా కలకలం!

14:14 May 30

పైలట్​కు కరోనా.. దారిలోనే వెనక్కి మళ్లిన విమానం!

దిల్లీ నుంచి మాస్కో బయల్దేరిన ఎయిర్​ ఇండియా విమానాన్ని దారిలోనే మళ్లీ వెనక్కి మళ్లించారు. పైలట్​కు కరోనా సోకడమే కారణంగా తెలుస్తోంది.  

Last Updated : May 30, 2020, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details