ఎయిర్ ఇండియా జంబో బి747 విమానం వుహాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి దిల్లీకి చేరుకుంది. కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో.. 324 మంది భారతీయ పౌరులను చైనా నుంచి భారత్కు తీసుకొచ్చింది.
రెస్క్యూ ఆపరేషన్
ఈ విమానంలో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇంజినీర్లు, భద్రతా సిబ్బంది కూడా ప్రయాణించారు. ఎయిర్ రెస్క్యూ డైరెక్టర్ (ఆపరేషన్స్) కెప్టెన్ అమితాబ్సింగ్ నేతృత్వంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది.
ఈ విమానంలో ఐదుగురు కాక్పిట్ సిబ్బంది, 15 మంది క్యాబిన్ సిబ్బంది కూడా ప్రయాణించారు. అయితే ఆరోగ్య భద్రత రీత్యా వీరు ప్రయాణికులకు ఎలాంటి సేవలు అందించడం కానీ, కనీసం మాట్లాడడం కానీ చేయలేదు. ప్రయాణికులకు కావాల్సిన ఆహారాన్ని వారి సీట్ల వద్దే అందుబాటులో ఉంచారు.