తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రన్​వే నుంచి లోయలో పడి రెండు ముక్కలైన విమానం - Air India plane skids off runway kerala

దుబాయ్​-కోజికోడ్​ ఎయిర్​ ఇండియా విమానం ల్యాండింగ్​ అవుతూ రన్​వేపై అదుపుతప్పింది. విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు డీజీసీఏ తెలిపింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు.

Air India plane skids off runway in Calicut; passengers hurt
రన్​వేపై అదుపుతప్పిన ఎయిర్​ ఇండియా విమానం

By

Published : Aug 7, 2020, 9:39 PM IST

Updated : Aug 7, 2020, 10:01 PM IST

కేరళ కోజికోడ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్​-కోజికోడ్​ ఎయిర్​ ఇండియా విమానం (IX-1344) అదుపుతప్పింది. ల్యాండింగ్​ సమయంలో రన్​వేపై జారుతూ 30 అడుగుల లోయలో పడింది. ప్రమాదం ధాటికి విమానం రెండు ముక్కలైంది. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనా సమయంలో భారీ వర్షం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.

కేరళలో రన్​వే నుంచి లోయలో పడిన విమానం

దుబాయ్​ నుంచి సాయంత్రం 7.40 గంటల ప్రాంతంలో కోజికోడ్​ చేరుకున్న బోయింగ్​ 737 విమానం.. ల్యాండింగ్​ సమయంలో రన్​వేపై అదుపుతప్పినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 191 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు. 100 మందికిపైగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

విమాన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​(డీజీసీఏ).

అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టాలని పోలీసులు, అగ్నిమాపక విభాగాన్ని ఆదేశించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​.

ఘటనపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్​షా.. ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: వధువు ఫొటోషూట్​లో 'లెబనాన్​ పేలుడు' దృశ్యాలు

Last Updated : Aug 7, 2020, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details