తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎయిర్​ఇండియా విమానంలో వింత వివాదం

ఎయిర్​ ఇండియా విమానంలో వింత వివాదం చెలరేగింది. తన టిఫిన్ బాక్స్​ శుభ్రం చేయమని ఓ పైలట్... విమాన సహాయకుడిని ఆదేశించారు . ఈ ఘటన ఇద్దరి మధ్య ఘాటు విమర్శలకు దారితీసింది. వివాదం నేపథ్యంలో పైలట్లు వ్యక్తిగత భోజనం తీసుకురాకూడదని ఆదేశించినుంది ఎయిర్​ ఇండియా.

ఎయిర్​ఇండియా విమానంలో వింత వివాదం

By

Published : Jun 20, 2019, 12:04 AM IST

బెంగళూరు విమానాశ్రయంలో ఓ వింత వివాదం చెలరేగింది. తన టిఫిన్​ బాక్స్​ విమానం ఎగరడానికి ముందే శుభ్రం చేయాలని పైలట్​ ఆదేశించడం... ఆ విమాన సిబ్బందికి చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరూ ఘాటు విమర్శలు చేసుకున్నారు. ఈ కారణంగా పైలట్లు వ్యక్తిగత భోజనం తీసుకురాకూడదని ఆదేశించనుంది ఎయిర్​ ఇండియా.

"సోమవారం జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. పైలట్లు వ్యక్తిగత భోజనం తీసుకురాకూదని ఆదేశించనున్నాం."


-ఎయిర్ ఇండియా ప్రకటన

బెంగళూరు నుంచి కోల్​కతాకు ఉదయం 11.40 నిమిషాలకు బయలుదేరాల్సి ఉంది ఎయిర్​ ఇండియా-772 విమానం. వివాదానికి కారణమైన పైలట్, సిబ్బంది ఒకరిని తొలగించడం వల్ల రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

"కెప్టెన్ తన టిఫిన్​ బాక్స్​ శుభ్రం చేయమని సిబ్బందిని ఆదేశించారు. ఇదే వారి మధ్య వివాదానికి కారణమైంది. విచారణ ప్రారంభమైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం."

-ఎయిర్​ ఇండియా అధికారి

ఇద్దరు ఉద్యోగులను దిల్లీ లోని ప్రధాన కార్యాలయానికి పిలిచామని, గురువారం విచారణ చేస్తామని పేర్కొన్నారు.

విమాన పైలట్లు ప్రత్యేక భోజనానికి ఆదేశించకూడదని, కంపెనీ నిర్ణయించిన భోజనాన్నే స్వీకరించాలని మార్చి 27న ఎయిర్​ఇండియా తమ సిబ్బందికి సూచించింది. బర్గర్లు, సూప్​లు, సాల్మన్ చేపలు, వంటి ఆహారాన్ని పైలట్లు ప్రత్యేకంగా తెప్పించుకుంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: 'న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి'

ABOUT THE AUTHOR

...view details