తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోగిన ఫైర్​ అల్లారం​..విమానం అత్యవసర ల్యాండింగ్​ - plane emergency landing

ఛత్తీస్​గఢ్​​​ రాజధాని ​రాయ్​పుర్ విమానాశ్రయంలో ఎయిర్​ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్​​ చేయవలసి వచ్చింది. విమానంలో అగ్నిప్రమాదానికి సంబంధించిన అల్లారం మోగడం వల్ల ఇలా జరిగినట్లు అధికారులు తెలిపారు.

రాయ్​పుర్​లో విమానం అత్యవసర ల్యాండింగ్​... ఫైర్​ అల్లారమే కారణం

By

Published : Nov 8, 2019, 11:16 PM IST

భువనేశ్వర్​నుంచి 180మంది ప్రయాణికులతోముంబయికి వెళ్తోన్న ఎయిర్​ ఇండియా విమానం ఛత్తీస్​గఢ్​​​ రాయ్​పుర్​ విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా ల్యాండ్​​ అయ్యింది.

విమానంలో అనుకోకుండా అగ్నిప్రమాద అల్లారం మోగడం వల్ల ల్యాండింగ్​ చేయవలసి వచ్చిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితక్షణమే రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించింది. ఎలాంటి ప్రమాదం జరగలేదని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అల్లారం మోగిందని వెల్లడించారు అధికారులు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'70 ఏళ్లలో కానిది 70 రోజుల్లో పూర్తి చేశాం'

ABOUT THE AUTHOR

...view details