దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో 'ట్యాక్సీబాట్' సేవలు వినియోగించిన మొట్టమొదటి విమానయాన సంస్థగా నిలిచింది. ట్యాక్సీబాట్ సాయంతో.. ప్రయాణికులు ఉన్న విమానాన్ని పార్కింగ్ బే నుంచి రన్వే వరకు విజయవంతంగా తీసుకొచ్చింది.
ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వినీ లోహణి ఇవాళ ఉదయం దిల్లీ విమానాశ్రయంలో ట్యాక్సీబాట్ సేవలు ప్రారంభించారు. ముంబయి వెళ్తున్న ఏఐ665 విమానాన్ని.. టెర్మినల్-3 నుంచి రన్వే వరకు ట్యాక్సీబాట్ విజయవంతంగా తీసుకొచ్చింది.
ట్యాక్సీబాట్ అంటే?