తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాయుసేన సారథిగా రాకేశ్​ కుమార్ సింగ్ భదౌరియా - Air Chief Marshal BS Dhanoa demits office of the Chief of Air Staff on superannuation

భారత ఎయిర్ చీఫ్​ మార్షల్​గా ఇన్నాళ్లు సేవలందించిన బీఎస్ ధనోవా ఇవాళ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో నూతన ఎయిర్ చీఫ్ మార్షల్​గా రాకేశ్​కుమార్​ సింగ్ భదౌరియా బాధ్యతలు స్వీకరించారు.

నూతన ఎయిర్ చీఫ్ మార్షల్​ రాకేశ్​కుమార్ సింగ్ భదౌరియా

By

Published : Sep 30, 2019, 11:03 AM IST

Updated : Oct 2, 2019, 1:48 PM IST

నూతన ఎయిర్ చీఫ్ మార్షల్​ రాకేశ్​కుమార్ సింగ్ భదౌరియా

సుదీర్ఘకాలం భారత వైమానిక దళానికి విశిష్ట సేవలందించిన భారత ఎయిర్ చీఫ్​ మార్షల్​ బీఎస్ ధనోవా ఇవాళ పదవీ విరమణ చేశారు. ధనోవా స్థానంలో నూతన ఎయిర్ చీఫ్ మార్షల్​గా రాకేశ్​కుమార్​ సింగ్ భదౌరియా బాధ్యతలు స్వీకరించారు.

పదవీ విరమణకు ముందు బీఎస్ ధనోవా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం వైమానిక దళం ఏర్పాటుచేసిన కవాతులో చివరి గౌరవ వందనం స్వీకరించారు.

ఇదీ చూడండి: ఐఐటీ మద్రాసులో ప్రధాని.. ప్రత్యేక ఎగ్జిబిషన్​ సందర్శన

Last Updated : Oct 2, 2019, 1:48 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details