తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​ స్థానిక సంస్థల బరిలో మజ్లిస్

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయనుంది. భారతీయ ట్రైబల్ పార్టీతో కలిసి బరిలోకి దిగనుంది. ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చల తర్వాత అధికారిక ప్రకటన వెలువడింది.

aimim-plans-gujarat-entry-via-southern-region
గుజరాత్​ స్థానిక సంస్థల బరిలో మజ్లిస్

By

Published : Jan 2, 2021, 7:25 PM IST

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ)తో కలిసి బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. బీటీపీ నేత ఛోటు వాసవ, ఎంఐఎం జాతీయ ప్రతినిధులు వారిస్ పఠాన్, ఔరంగబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్​ మధ్య జరిగిన సమావేశ అనంతరం ఎన్నికల పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు.

ఎంఐఎం బీటీపీ నేతల మధ్య చర్చ

స్థానిక సంస్థల్లో ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తామని భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) ఇదివరకే ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారమే ఎంఐఎం నేతలు వడోదరకు చేరుకొని చర్చలు ప్రారంభించారు. వీరికి పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.

ఇప్పటివరకు ముస్లింలను రబ్బర్ స్టాంప్​లా వాడుకున్నారని ఇంతియాజ్ ఆరోపించారు. ఇక నుంచి ముస్లింలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల సమస్యలను ఎంఐఎం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతి

ABOUT THE AUTHOR

...view details