తెలంగాణ

telangana

By

Published : Sep 18, 2019, 5:54 AM IST

Updated : Oct 1, 2019, 12:40 AM IST

ETV Bharat / bharat

'10 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థే లక్ష్యం'

భారతదేశాన్ని 2030 నాటికి 10 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ తెలిపారు. 2025 నాటికి భారత్​లో 26 బిలియన్ డాలర్ల విలువై రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఆయుధాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయి వరకు ఎదుగుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

'2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థే లక్ష్యం'

'10 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థే లక్ష్యం'

2030 నాటికి భారత్​ను 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ పేర్కొన్నారు. ఇందుకు తోడ్పడే వాటిల్లో రక్షణ రంగం ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2024 నాటికి 5 ట్రిలియన్​ డాలర్లు, 2030 నాటికి 10 ట్రిలియన్​గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం." -రాజ్​నాథ్​సింగ్​, రక్షణమంత్రి

'మేక్​ ఇన్​ ఇండియా: 2025 నాటికి 26 బిలియన్​ డాలర్ల రక్షణ పరిశ్రమ' ఇతివృత్తంతో సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చురర్స్​ (ఎస్​ఐడీఎమ్) వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాజ్​నాథ్​.

ఎగుమతిదారుగా మారతాం

గతంలో అనేక కారణాల వల్ల భారత రక్షణ పరిశ్రమ తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేదని రాజ్​నాథ్​ సింగ్ వ్యాఖ్యానించారు. ఫలితంగా భారత్​ దిగుమతి చేసుకున్న ఆయుధాలపై ఆధారపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

మేక్​ ఇన్​ ఇండియాతో భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రధాన ఆయుధాల తయారీ కేంద్రంగా మారుస్తామని రాజ్​నాథ్ పేర్కొన్నారు. అంతేకాకుండా నికర రక్షణ ఎగుమతిదారుగా మార్చడానికి అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఈ లక్ష్యాన్ని సాధించేందుకు పారిశ్రామిక లైసెన్సింగ్​ ప్రక్రియను సరళీకృతం చేస్తామని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల క్యాప్​ను పెంచుతామని, డిఫెన్స్ ఆఫ్​సెట్ విధానాన్ని క్రమబద్ధీకరిస్తామని రాజ్​నాథ్ తెలిపారు.

20 నుంచి 30 లక్షల​ ఉద్యోగాలు

అదనంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి, రక్షణశాఖలో సుమారుగా 20 నుంచి 30 లక్షల​ ఉద్యోగాలు సృష్టిస్తామని రాజ్​నాథ్ తెలిపారు.

ఇదీ చూడండి: 'గేట్స్​' పురస్కారంతో మోదీకి సత్కారం- కారణమిదే

Last Updated : Oct 1, 2019, 12:40 AM IST

ABOUT THE AUTHOR

...view details