తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన ఎయిమ్స్​​ నర్సులు - AIIMS nurses fires on Central health ministry

కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెబాట పట్టనున్నాయి ఎయిమ్స్​ నర్సు సంఘాలు. తమ సమస్యలను పరిష్కరిస్తామని ఆరోగ్య శాఖ హామీ ఇచ్చి దాదాపు ఏడాదవుతున్నా.. ఇంత వరకు అవి కార్యరూపం దాల్చలేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టనున్నారు. తక్షణమే వారి డిమాండ్​లను పరిష్కారించాలని కోరుతూ.. సమ్మె చేయనున్నట్టు నర్సు యూనియన్​ అధ్యక్షుడు తెలిపారు.

AIIMS nurses across India to call for nationwide strike
దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన ఎయిన్స్​ నర్సులు

By

Published : Oct 16, 2020, 4:56 AM IST

కేంద్ర ఆరోగ్య శాఖ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్స్​ (ఎయిమ్స్​) నర్సులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మందికిపైగా సిబ్బంది.. నిరసనబాట పట్టనున్నారు. నర్సుల హామీలను నెరవేరుస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో మాటిచ్చినా.. ఇంతవరకూ వాటిని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు నర్సు యూనియన్​ అధ్యక్షుడు హరీశ్​ కుమార్​ కజ్లా.

"మా సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా.. ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. అందుకే మేం నిరవధిక సమ్మె చేపట్టబోతున్నాం. తొలుత దిల్లీ ఎయిమ్స్​ నర్సులతో సమ్మె ప్రారంభమవుతుంది. అనంతరం.. దేశవ్యాప్త నర్సులంతా ఏకమై సమ్మెను ఉద్ధృతం చేయనున్నాం."

- హరీశ్​ కుమార్​ కజ్లా, ఎయిమ్స్​ నర్సు యూనియన్​ అధ్యక్షులు

పర్యావరణం, ఆరోగ్యం, భద్రత(ఈహెచ్​ఎస్​) సంస్కరణలు, 6 సెల్​ ఇంక్రిమెంట్​, ప్రత్యేక అలవెన్స్​లు వంటి డిమాండ్​ చేస్తున్నారు ఎయిమ్స్​ నర్సులు.

కొవిడ్​పై పోరాడుతున్నా.. కనికరం లేకుండా..

తమ డిమాండ్ల పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినా.. అవి ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు నర్సులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారిందని వారు వాపోయారు. ఓవైపు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్​ బాధితులకు సేవ చేస్తుంటే.. కేంద్రం మాత్రం తమపట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
ఇదీ చదవండి:'సెప్సిస్‌'ను ముందుగానే గుర్తించే టెక్నాలజీ!

ABOUT THE AUTHOR

...view details