తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ను లెక్కచేయని మంత్రులు- భారీ ర్యాలీ నిర్వహణ - tamilnadu corona news

తమిళనాడులో అన్నాడీఎంకే మంత్రులు లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. వాహనాలతో కిలోమీటర్ల దూరం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి చర్య పట్ల వైద్యాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

aidmk ministers breaks lockdown rules
లాక్​డౌన్​ను లెక్కచేయని మంత్రులు- భారీ ర్యాలీ నిర్వహణ

By

Published : May 17, 2020, 8:37 PM IST

తమిళనాడు తిరుపత్తూర్​లో వాహనాలతో కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించి.. లాక్​డౌన్​ నిబంధనలను అతిక్రమించారు అధికార అన్నాడీఎంకే మంత్రులు. వీరి చర్యల పట్ల జిల్లా వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేేసీ వీరమణి చర్యల పట్ల అసహనం వ్యక్తం చేశారు.

ఎగబడిన జనం..!

తిరుపత్తూర్ జిల్లా జొల్లారిపెట్టాయిలో 80 వేల మందికి నిత్యావసర సరకులు అందించే ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే కార్యక్రమంలో కరోనా జాగ్రత్తలు పాటించే విషయాన్ని విస్మరించారు. కనీసం మాస్కులు లేకుండా సరుకుల కోసం భారీగా ఎగబడ్డారు గ్రామస్థులు. సామజిక దూరం నిబంధనలు పట్టించుకోలేదు.

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details