తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ డ్రోన్లు కనిపిస్తే ఇక కూల్చివేయడమే...! - భారత సరిహద్దులో డ్రోన్ల కలకలం

భారత్​లో అలజడులు సృష్టించేందుకు పాకిస్థానీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమ ఆయుధాలు చేరవేస్తున్నారన్న అనుమానాల నేపథ్యంలో సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి అడుగులలోపు ఎత్తులో ఎగిరే డ్రోన్లను కూల్చివేసేందుకు అనుమతించింది.

ఆ డ్రోన్లు కనిపిస్తే ఇక కూల్చివేయడమే...!

By

Published : Oct 14, 2019, 10:05 AM IST

Updated : Oct 14, 2019, 12:47 PM IST

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం భారత్​-పాక్​ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్​లో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు. సరిహద్దుల మీదగా దేశంలోకి అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు వంటివి చేరవేసేందుకు చిన్న చిన్న డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది.

సరిహద్దుల మీదగా 1000 అడుగులు ఎత్తులోపు ఎగిరే డ్రోన్లను కూల్చివేసేందుకు అనుమతులు జారీ చేసింది సైన్యం.

వెయ్యి అడుగులపైన..

ఒక వేళ వెయ్యి అడుగులపైన డ్రోన్లు ఎగురుతున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆపైన వెళ్లే విమానాలను కూల్చివేసే ప్రమాదం ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

పంజాబ్​లో కలకలం...

పంజాబ్​లోని భారత్​-పాక్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల చిన్న డ్రోన్లు దేశంలోకి ప్రవేశించినట్లు సరిహద్దు భద్రత దళం (బీఎస్​ఎఫ్​) గుర్తించింది. గత సోమవారం రాత్రి పంజాబ్​ ఫిరోజ్​పుర్​లోని భారత్​-పాక్​ సరిహద్దులో ఓ డ్రోన్​ దేశంలోకి చొరబడినట్లు బీఎస్​ఎఫ్​ అధికారులు గుర్తించారు. దీనిపై భద్రతా సిబ్బంది సహా స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: సిలిండర్​ పేలి కుప్పకూలిన భవనం- 10 మంది మృతి

Last Updated : Oct 14, 2019, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details