కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గత నెలలో సీనియర్ నేతలు రాసిన లేఖ విషయంలో పరిష్కారం కుదిరిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ వెల్లడించారు. ఇటీవల జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే విషయమై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడిన అన్వర్.. పార్టీ విషయాలపై చర్చించారు. లేఖ రాసిన సీనియర్ నేతలు పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన వర్కింగ్ కమిటీలోనూ ఈ నేతలు ఉన్నారని గుర్తు చేశారు. ఇందులో ఎలాంటి ఊహాగానాలు, వదంతులకు తావులేదని స్పష్టంచేశారు.