తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసు పల్లకీలో.... బెల్ట్​షాపు నిందితుడు - police rides

గుజరాత్​ అహ్మదాబాద్ పోలీసులు అక్రమ బెల్ట్​షాపులపై దాడి చేశారు. కొందరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఓ భారీకాయుడు రానని భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో అతనిని మంచంతో సహా పోలీసు స్టేషన్​కి తరలించారు.

అక్రమ బెల్ట్​షాపు నిర్వాహకుని మంచంపై మోసుకుని వెళ్తున్న పోలీసులు

By

Published : Mar 9, 2019, 7:45 PM IST

అక్రమ బెల్ట్​షాపు నిర్వాహకుని మంచంపై మోసుకుని వెళ్తున్న పోలీసులు

బెల్ట్​షాపులపై పోలీసుల రైడింగ్! ఈ మాట వినగానే తప్పు చేసిన షాపు నిర్వాహకులు తప్పించుకుని పారిపోదామని చూస్తారు. కానీ గుజరాత్​లోని ఓ బెల్ట్​షాపు యజమాని మాత్రం పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అహ్మదాబాద్​ పోలీసులు ఎప్పటిలానే సాధారణంగా అక్రమ బెల్ట్​షాపులపై దాడులు చేసి వాటి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఓ షాపు యజమాని భారీకాయం వల్ల ఎటూ కదలలేక పోలీసులకు చిక్కాడు. పోలీసు స్టేషన్​కు రానని భీష్మించుకుని కూర్చోవడం వల్ల చేసేది లేక అతనిని మంచంపై ఉంచి మోసుకొనిపోయారు పోలీసులు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details