అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో భాగంగా మురికివాడలు కనిపించకుండా దారి పొడవునా గోడ నిర్మిస్తున్న గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు మరో అడుగు ముందుకేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సబర్మతి వరకు జరిగే రోడ్ షో ప్రాంతంలో మురికివాడల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించేందుకు పూనుకున్నారు.
ఈ క్రమంలో నగరంలోని మొతెరా ప్రాంత మురికివాడల నివాసితులకు నోటీసులు జారీ చేశారు. ఆ ప్రాంతాన్ని 7 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. అధికారుల నోటీసులతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.