తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అగస్టా కేసులో మధ్యవర్తి గుప్తా​కు ఈడీ కస్టడీ

అగస్టా వెస్ట్​ల్యాండ్​ కేసులో రక్షణ రంగ మధ్యవర్తి​ సుషేన్​ మోహన్​ గుప్తాకు నాలుగు రోజుల ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కస్టడీ విధించింది దిల్లీ కోర్టు. కొంతకాలం కిందట అరెస్టయిన రాజీవ్​ సక్సేనా ఇచ్చిన ఆధారాలతో గుప్తాను ఆరెస్టు చేశారు ఈడీ అధికారులు.

అగస్టా మధ్యవర్తి గుప్తా​కు నాలుగు రోజుల కస్టడీ

By

Published : Mar 26, 2019, 5:47 PM IST

అగస్టా వెస్ట్​ల్యాండ్​ కేసులో దిల్లీకి చెందిన రక్షణ రంగ మధ్యవర్తి సుషేన్​ మోహన్​​ గుప్తాను నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు ఈడీకి అనుమతిచ్చిందిదిల్లీ కోర్టు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) సోమవారం సుషేన్​ను ఆరెస్టు చేసింది.

రూ.3,600 కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి కొంత కాలం క్రితం న్యాయవాది గౌతమ్​ ఖైతన్​, బ్రిటన్​కు చెందిన మధ్యవర్తి క్రిస్టియన్​ మిషెల్​లను ఈడీ ఆరెస్టు చేసింది.

రాజీవ్ సక్సేనా ఆధారాలే కీలకం

అగస్టా కేసు నిందితుల్లో ఒకరైన రాజీవ్​ సక్సేనాను... యూఏఈ నుంచి భారత్​కు వచ్చినప్పుడు ఈడీ అరెస్టు చేసింది. ఆయన అప్రూవర్​గా మారాడు. ఆయన ఇచ్చిన ఆధారాల మేరకు సుషేన్​ను ఆరెస్టు చేసింది ఈడీ.

గుప్తా వద్ద సమాచారం?

హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గురించి గుప్తా వద్ద సమాచారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details