తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎడారిలో జలకళ... ఇలా సాధ్యమైంది... - నీటి సంరక్షణ

ఎడారి ప్రాంతమైన రాజస్థాన్​లో ఎక్కడ చూసినా నీటి ఎద్దడే. ఇక్కడ ఉన్న 295 బ్లాకుల్లో 185 బ్లాకులు నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలకు చెక్​ పెట్టేందుకు జోబ్​నేర్​ ప్రాంతంలోని వ్యవసాయ యూనివర్సిటీ ముందుకొచ్చింది. విలక్షణమైన సంరక్షణ విధానాలను అమలు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టింది. ఆ విధానమేంటో మీరూ చూసేయండి.

Agriculture University's new technique helps Rajasthan meet its water demand
ఎడారిలో జలకళ- బొట్టుబొట్టునూ ఒడిసిపడుతున్న రాజస్థాన్!

By

Published : Jul 15, 2020, 11:45 AM IST

ఎడారిలో జలకళ... ఇలా సాధ్యమైంది...

'నీటి విలువ తెలుసని ఎవరైనా చెబితే అది అబద్ధమైనా అయి ఉండాలి, లేదా ఆ వ్యక్తి రాజస్థాన్ వాసై ఉండాలి'... రాజస్థాన్​లో చాలా ప్రాచుర్యంలో ఉన్న మాట ఇది. అప్పుడే మాటలు వచ్చిన చిన్నారుల నుంచి మంచం మీద ఉన్న వృద్ధుల వరకు రాజస్థాన్​లో ప్రతి ఒక్కరికీ నీటి విలువ తెలుసు. ఒక్కో బొట్టు నీటి చుక్కను ఒడిసిపట్టుకునేందుకు ఇక్కడి ప్రజలు తీవ్రంగా శ్రమిస్తారు. అందుకే సాధారణంగా నీటి విలువ తెలుసుకోవాలంటే రాజస్థాన్​లో నివసించాలి అంటుంటారు. అంత దారుణంగా ఉంటుంది ఈ ఎడారి ప్రాంతంలోని పరిస్థితి.

ఇదే విధంగా జైపుర్​లోని జోబ్​నేర్ ప్రాంతవాసులు గత 25 సంవత్సరాల నుంచి నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ నీటి సంక్షోభం ఎంతలా అంటే.. ఇక్కడి శ్రీ కరన్ నరేంద్ర వ్యవసాయ యూనివర్సిటీ కూడా నీటిని ట్యాంకుల్లో తెచ్చుకోవాల్సినంతగా. 1995 నుంచి ఇలా బయటి నుంచే నీటిని తెప్పించుకుంటోంది యూనివర్సిటీ.

పరిష్కారంతో ముందుకు

కానీ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి యూనివర్సిటీ ఓ ఉపాయాన్ని ఆలోచించింది. సరైన ప్రణాళికతో తమతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకూ నీరు అందుబాటులో ఉండే విధంగా సంరక్షణ చర్యలు చేపట్టింది.

మూడు కోట్ల లీటర్ల సామర్థ్యం

స్థానిక మున్సిపాలిటీ అధికారుల సమన్వయంతో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు పూనుకుంది. దగ్గర్లోని కొండప్రాంతాల్లో పడే వర్షాన్ని సేకరిచేందుకు 33 లక్షల లీటర్ల సామర్థ్యంతో మూడు కుంటలను నిర్మించింది. దీంతో పాటు మూడు కోట్ల లీటర్ల నీటిని నిల్వచేసుకునే మరో చెరువును నిర్మించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మరికొన్ని చిన్న నీటి కుంటలను ఏర్పాటు చేసింది. వర్షం పడిన తర్వాత నీరు ఈ కుంటల్లోకి వచ్చి చేరుతుంది. ఒక కుంట నిండిన తర్వాత మరో కుంటలోకి నీరు వెళ్తుంది. ఇలా చెరువులన్నీ నిండిపోతాయి. భుగర్భజలాలు పెరుగుతాయి.

యూనివర్సిటీ అవసరాలు

మూడు కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న కుంటలోని నీటిని యూనివర్సిటీ తమ అవసరాలకు వాడుకునేలా ప్రణాళిక వేసుకున్నట్లు విశ్వవిద్యాలయ మాజీ డీన్ డీఎస్ బంగ్రావా పేర్కొన్నారు. కళాశాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగేందుకు ఇది ఉపయోగపడిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూగర్భ నీటి మట్టం 50 అడుగులకు చేరిందని వెల్లడించారు.

విపత్కర పరిస్థితులు!

రాజస్థాన్​లో నీటి సంక్షోభం అత్యంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడి 295 బ్లాకుల్లో 185 బ్లాకులు డార్క్​ జోన్లలోనే ఉన్నాయి. 2003లో వీటి సంఖ్య 164 ఉండగా ప్రస్తుతం 185కి పెరిగింది. భూగర్భంలో నీటి పునరుద్ధరణ జరగని ప్రాంతాలను డార్క్​ జోన్లుగా వ్యవహరిస్తారు.

ABOUT THE AUTHOR

...view details