తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శిక్షలు' - rahul tweet on farm bills

మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు మరణ శిక్ష వంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంట్ లోపల, బయట రైతుల గళాన్ని కేంద్రం అణచివేస్తోందని మండిపడ్డారు. బిల్లులపై ఓటింగ్ ఓటింగ్ నిర్వహించాలని అభ్యర్థించిన సమయంలో విపక్షాలు తమ సీట్లలోనే ఉన్నాయన్న కథనాన్ని ట్వీట్ చేశారు.

Agri bills are death sentence for farmers: Rahul
'వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శిక్షలు'

By

Published : Sep 28, 2020, 2:34 PM IST

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్. తాజాగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఈ బిల్లులపై మండిపడ్డారు. బిల్లులను రైతులకు వేసిన 'మరణ శిక్ష'గా అభివర్ణించారు.

"వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట మరణ శిక్షలు. పార్లమెంటు లోపల, బయట రైతుల గళాన్ని అణచివేశారు. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోయిందనేందుకు ఇదే సాక్ష్యం."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

బిల్లుపై ఓటింగ్ కోసం రాజ్యసభలో విపక్షాలు తమ సీట్ల నుంచే అభ్యర్థించాయన్న ఓ పత్రిక కథనాన్ని ట్వీట్​కు జోడించారు రాహుల్.

రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఈ బిల్లులను కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టాల ద్వారా కార్పొరేట్ సంస్థల చేతుల్లో రైతులు కీలు బొమ్మలా మారతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details