పండిత్ దీన్‌దయాళ్ శర్మ జయంతి సందర్భంగా నిర్వహించిన గ్రామీణ్ కౌశల్ యోజన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేశారు మోదీ. వ్యవసాయ సంస్కరణలు రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చామని ఉద్ఘాటించారు.
"గత ప్రభుత్వాలు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చాయి. అవి ఏ మాత్రం రైతులు, కార్మికులకు అర్థం కావు. కానీ, భాజపా ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం. గతేడాదిగా 10 కోట్ల మంది రైతులకు రూ.లక్ష కోట్లు అందించాం. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం."
- ప్రధాని నరేంద్రమోదీ
ఇదే వేదికగా బిల్లుకు వ్యతిరేకిస్తున్న విపక్షాలపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు మోదీ.