అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన కోసం ఈనెల 24నభారత్కు రానున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు ట్రంప్. ఆయన సతీమణితో కలిసి సుమారు రెండు గంటల మేర అక్కడే గడుపుతారని సమాచారం. ట్రంప్ ఆగ్రాకు వస్తున్న సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
నమస్తే ట్రంప్: తాజ్‌మహల్ దారిపొడవునా ఆయన బొమ్మలే - నమస్తే ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్ వెళ్లే మార్గంలోని గోడలను అగ్రరాజ్య అధ్యక్షుడికి స్వాగత నినాదాలు, ఆయన చిత్రాలతో నింపేశారు అధికారులు.

నమస్తే ట్రంప్
ఖేరియా విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్ చేరుకునే మార్గంలోని గోడలను అధ్యక్షుడు ట్రంప్ చిత్రాలతో నింపేశారు. నమస్తే ట్రంప్, వెల్కమ్ యూఎస్ ప్రెసిడెంట్, ట్రంప్ అండ్ మెలానియా.. వంటి పలు స్వాగత నినాదాలతో గోడలు నిండిపోయాయి.
నమస్తే ట్రంప్: తాజ్‌మహల్ వెళ్లే మార్గంలో ఎటు చూసినా ఆ చిత్రాలే
ఇదీ చూడండి: ట్రంప్ మనసులో ఏముంది..? వాణిజ్య ఒప్పందమా? ప్యాకేజీనా?
Last Updated : Mar 2, 2020, 2:06 AM IST