తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బార్​ కౌన్సిల్​ అధ్యక్షురాలిని హత్య చేసిన న్యాయవాది - యూపీ

ఉత్తర్‌ప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు దార్వేశ్‌ సింగ్‌ను ఆగ్రాలో మనీష్‌శర్మ అనే న్యాయవాది హత్య చేశాడు. అనంతరం తనను తాను కాల్పుకున్నాడు.  ఆగ్రా సివిల్​ కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది.

బార్​ కౌన్సిల్​ అధ్యక్షురాలిని హత్య చేసిన న్యాయవాది

By

Published : Jun 12, 2019, 8:45 PM IST

Updated : Jun 12, 2019, 9:10 PM IST

బార్​ కౌన్సిల్​ అధ్యక్షురాలిని హత్య చేసిన న్యాయవాది

ఉత్తర్‌ప్రదేశ్‌ న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు దార్వేశ్‌ సింగ్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఆగ్రాలో మనీష్‌శర్మ అనే న్యాయవాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రెండ్రోజుల క్రితమే యూపీ బార్‌కౌన్సిల్‌ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు దార్వేశ్​.

ఆమె గౌరవార్థం ఆగ్రా సివిల్‌కోర్టు ప్రాంగణంలో బుధవారం సభ నిర్వహించారు. సభ జరుగుతుండగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు దార్వేశ్‌ సింగ్‌పై మనీష్‌ మూడురౌండ్ల కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత తనకు తాను కాల్చుకున్నాడు మనీష్​.

ప్రస్తుతం మనీష్‌శర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మనీష్‌ ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Jun 12, 2019, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details