ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో కలకలం రేపిన ప్రైవేటు బస్సు హైజాక్ ఘటనలో పురోగతి సాధించారు పోలీసులు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఫతేబాద్ పోలీసులు ఫిరోజాబాద్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో.. హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడితోపాటు అతని అనుచరుడు పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. అది ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు గాయపడగా.. మరొకరు పరారయ్యాడు. గాయపడిన అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.