తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' చట్టంపై సుప్రీంలో సవాల్​: భాజపా మిత్రపక్షం​​ - పౌరసత్వ చట్ట సవరణను సుప్రీంలో సవాల్​ చేస్తామన్న అసోం గణ పరిషత్​

అసోంలో భాజపాకు తన మిత్రపక్షం అసోం గణ పరిషత్​ (ఏజీపీ) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వ చట్ట సవరణను సవాల్​ చేస్తూ ఏజీపీ.. సుప్రీంను ఆశ్రయిస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. మరోవైపు ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్(ఏఏఎస్​యూ)​ కూడా రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు సంకేతాలిచ్చింది.

AGP to file plea in Supreme Court for revocation of   Citizenship Ac
పౌరసత్వ చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకు ఏజీపీ

By

Published : Dec 15, 2019, 3:27 PM IST

'పౌరసత్వ చట్ట సవరణ'పై ఈశాన్యాన నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా భాజపా మిత్రపక్షం అసోం గణ పరిషత్​ (ఏజీపీ) పౌరసత్వ చట్ట సవరణను సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.

యూటర్న్​..

పౌరసత్వ చట్ట సవరణకు ఏజీపీ మొదట మద్దతు తెలిపింది. అయితే ప్రజల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా చాలా మంది పార్టీ నేతలు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏజీపీ యూటర్న్​ తీసుకుంది. పౌరసత్వ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలనే డిమాండ్​తో... ప్రధాని మోదీ, అమిత్​షాలను కూడా కలవాలని నిర్ణయించింది. ప్రజల అభిమతమే తమ అభిమతమని.. ఈశాన్య రాష్ట్రాల గుర్తింపు, ఉనికిని కోల్పోవడానికి సిద్ధంగా లేమని ఏజీపీ తేల్చిచెబుతోంది.

స్వపక్షం నుంచే వ్యతిరేకత

పౌరసత్వ చట్టంపై అసోం భాజపా నేతల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. అసోం భాజపా నేత జతిన్​ బోరా.. సీఏఏకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

ఏఏఎస్​యూ పార్టీ

పౌరసత్వ చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆల్​ అసోం స్టూడెంట్స్ యూనియన్​ (ఏఏఎస్​యూ) త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని సంకేతాలిచ్చింది. దీనికి అనుబంధంగా కళాకారుల ఫోరం 'శిల్పి సమాజ్​' ఏర్పాటుచేస్తామని పేర్కొంది. అధికార భాజపా, ఏజీపీ, ప్రతిపక్ష కాంగ్రెస్​లకు ప్రత్యామ్నాయంగా పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు ఏఏఎస్​యూ అధ్యక్షుడు దీపాంక్​ నాథ్​ పేర్కొన్నారు.

రగులుతోన్న ఈశాన్యం..

పార్లమెంటు ఉభయసభల్లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు చెలరేగాయి. ప్రత్యేకంగా అసోంలో ఈ ఘర్షణల్లో ముగ్గురు మరణించడంతో అక్కడ కర్ఫ్యూ విధించారు.

ఇదీ చూడండి: 'పౌర'సెగ: బంగాల్​లో ఆందోళనలు మరింత ఉద్ధృతం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details