తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం ఎన్​ఆర్​సీపై సర్వత్రా అసంతృప్తి

అసోంలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను వెనక్కి పంపే ఉద్దేశంతో చేపట్టిన ఎన్​ఆర్​సీ తుది జాబితా విడుదలపై స్పందించింది ఆ రాష్ట్ర అధికార కూటమి భాగస్వామి అసోం గణపరిషత్. చాలా చిన్న కారణాలతో తుది జాబితా నుంచి పలువురిని తొలగించడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది. ఎన్​ఆర్​సీ జాబితాపై అనుమానాలున్నాయని.. ఆరేళ్ల క్రితం సుప్రీంలో కేసు దాఖలు చేసిన అసోం పబ్లిక్ వర్క్స్ పేర్కొంది.

ఎన్​ఆర్​సీపై అసోం గణపరిషత్ అసంతృప్తి

By

Published : Aug 31, 2019, 5:48 PM IST

Updated : Sep 28, 2019, 11:45 PM IST

నేడు విడుదల చేసిన జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ)పై అసోంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న అసోం గణపరిషత్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్​ఆర్​సీ రూపకల్పనను పర్యవేక్షించిన సుప్రీంకోర్టు తుది జాబితాపై సమీక్ష చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. చాలా చిన్న కారణాలు చూపి జాబితా నుంచి తొలగించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఏజీపీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరా.

"ఎన్​ఆర్​సీ తుది జాబితాతో ఎంతమాత్రం సంతోషంగా లేము. 19,06, 657 మందికి తుది జాబితాలో చోటు దక్కకపోవడాన్ని అంగీకరించలేం. అసోం ప్రజలు సరళమైన ఎన్​ఆర్​సీని ఆశించారు. కానీ ప్రస్తుతం విడుదల చేసిన జాబితా... వారిలో మరిన్ని భయాలను రేకేత్తించింది. ఈ జాబితాపై సుప్రీంకోర్టులో సమీక్ష జరిగే అవకాశం ఉంది."

- అతుల్ బోరా, అసోం గణపపరిషత్ అధ్యక్షుడు

అసోం గణపరిషత్​కు మాతృసంస్థ అయిన ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ కూడా ఎన్​ఆర్​సీ తుది జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని ప్రకటించింది.

ఎన్​ఆర్​సీపై సందేహాలు: అసోం పబ్లిక్ వర్క్స్​

ఆరేళ్ల క్రితం ఎన్​ఆర్​సీ నవీకరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సామాజిక సంస్థ అసోం పబ్లిక్​ వర్క్స్ తాజా జాబితాపై సందేహాలు లేవనెత్తింది. లోపభూయిష్టమైనదిగా అభివర్ణించింది. జాబితా రూపకల్పనలో ఉపయోగించిన సాఫ్ట్​వేర్​పై అనుమానాలు వ్యక్తంచేసింది.

"అసోంలోకి అక్రమంగా దేశీయుల రాక అనే సమస్యను ఎన్​ఆర్​సీ తీర్చలేదని తాజాగా నిరూపితమైంది. దోష రహితంగా పూర్తయితే అది అసోం చరిత్రలో సువర్ణ అధ్యాయం అవుతుంది."

- అభిజిత్ శర్మ, అసోం పబ్లిక్ వర్క్స్ అధ్యక్షుడు

ఇదీ చూడండి: అసోం: ఎన్​ఆర్​సీలో ప్రముఖుల పేర్లు గల్లంతు

Last Updated : Sep 28, 2019, 11:45 PM IST

ABOUT THE AUTHOR

...view details