మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కఠిన పరీక్ష ఎదుర్కోవాలని అన్నారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అగ్నీపథ్(అగ్ని కీలల దారి) పదాన్ని మూడు సార్లు వినియోగించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేన ముందుకు సాగాల్సిన తీరుకు సంకేతంగా ఉంది రౌత్ ట్వీట్.
హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన ప్రముఖ రచన 'అగ్నీపథ్'. ఈ టైటిల్‌తో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా 1990లలో విడుదలైన చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
విజయం సాధించే వరకు విరామం తీసుకోరాదన్న హరివంశ్ రాయ్ కవితను నిన్న కూడా ట్వీట్ చేశారు రౌత్.