దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతులు తమకు కావాల్సిన ఆహారం కోసం విస్తృత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిరసన జరుగుతున్న ప్రాంతాలకు రైతులు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో రోటీలు తయారు చేసే యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
రైతుల నిరసనల్లో రోటీ యంత్రాలు
దేశరాజధాని సరిహద్దులో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు.. తమ భోజన వసతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా.. రోటీ తయారీ యంత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ద్వారా గంటకు 900 రోటీలు తయారు చేయవచ్చు.
రైతుల నిరసనల్లో రోటీ యంత్రాలు
ఈ యంత్రాల ద్వారా గంటకు 900 రోటీలు తయారు చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తయారు చేసేందుకు ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. నిరసన చేస్తున్న రైతులకు భోజన సరఫరాకు ఎటువంటి అంతరాయం రాకుండా.. ఇక్కడి వంట శాలలు నిరంతరం పనిచేస్తున్నాయి.
ఇదీ చదవండి:వెనక్కితగ్గని అన్నదాత- పెరుగుతున్న మద్దతు