తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువ కశ్మీరాలు: కష్టాలను ఎదిరించి లక్ష్యాల వైపు - Pulwama news

కశ్మీర్​ లోయలోని యువత ఆలోచన ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ఉగ్రమూకల మాయలో పడకుండా.. స్వయం కృషివైపు అడుగులు వేస్తున్నారు. అందుకు నిదర్శనమే పుల్వామాకు చెందిన ముగ్గురు యువకుల ప్రయత్నం. ప్రతికూలతలకు ఎదురొడ్డి నిలిచి.. సంగీత బృందాన్ని ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు.

Kashmiri youths start musical band in Pulwama
ఉగ్ర ఉచ్చు నుంచి స్వావలంబన వైపు కశ్మీరీ యువత

By

Published : Aug 26, 2020, 10:59 AM IST

Updated : Aug 26, 2020, 12:34 PM IST

కశ్మీర్​ లోయ ఒక భూతల స్వర్గం. కానీ.. అక్కడ సరైన వసతులు, అవకాశాలు లేక చాలా మంది యువత పెడదారులు పడుతుంటారు. ఉగ్రమూకల మాయలో పడి తమ జీవితాలను వృథా చేసుకుంటారు. ఉగ్రవాదంతో దక్షిణ కశ్మీర్​లోని పుల్వామా జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. కానీ.., ఇప్పుడు పరిస్థితులు మారాయి. అక్కడి యువత తమ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నారు. తమలోని నైపుణ్యాన్ని నిరూపించుకునేందుకు కృషి చేస్తున్నారు.

కష్టాలను ఎదిరించి లక్ష్యాల వైపు కశ్మీరీ యువత

పుల్వామా పింగ్లేనా ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకుల ప్రయత్నమే ఇందుకు నిదర్శనం. 'ఫాల్కన్'​ పేరుతో వారు ఓ సంగీత బృందాన్ని ఏర్పాటు చేశారు. సొంత ఖర్చుతో తమకు కావాల్సిన అన్ని వస్తువులు, వాద్యాలు కొనుగోలు చేసుకుని.. కచేరీలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్​ వ్యాప్తంగా ఈ బృందానికి ప్రశంసలు అందుతున్నాయి.

కశ్మీర్​లోని కళాకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించటం లేదు. చాలా మంది ఆర్టిస్టులు సొంత ఖర్చుతో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసుకుని షోలు నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా యువత చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ.. పూర్తి ధైర్యం, ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కళాకారులకు ప్రభుత్వం సాయం అందిస్తే.. పరిస్థితులు మరింత మెరుగుపడతాయి.

- ఫాల్కన్​ బృందం సభ్యుడు

కశ్మీర్​లోయలో ఎప్పటి నుంచే సంగీత కళాకారులు ఉన్నారని వీరు తెలిపారు. అయితే.. గతంలో కేవలం కశ్మీరీ పాటలు పాడేవారని, ప్రస్తుతం బాలీవుడ్​, హాలీవుడ్​ పాటలు పాడటం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పుల్వామా ఉగ్రదాడి కేసులో ఎన్​ఐఏ ఛార్జిషీటు

Last Updated : Aug 26, 2020, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details