లోక్సభలో భారీ ఆధిక్యం భాజపా సొంతం. కానీ రాజ్యసభలో సరిపడ సంఖ్యా బలం లేదు. అందుకే ఎన్నో కీలక బిల్లులు ఇంకా ఎగువసభ దాటలేకపోతున్నాయి. అయితే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ఈ సమస్యను అధిగమించే అవకాశాలున్నాయి.
జులై 5 తర్వాత...
రాజ్యసభలో మొత్తం సీట్లు 245. ఓ పార్టీ సాధారణ మెజారిటీ పొందాలంటే కావల్సిన సీట్లు 123. ఇటీవలే తెదేపా రాజ్యసభ సభ్యులు నలుగురు భాజపాలో చేరారు. దీనివల్ల ఎగువసభలో భాజపా బలం 74కు చేరింది. జులై 5న సభలోని 6 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలోని నాలుగింట్లో కాషాయ దళం గెలుపు సునాయాసం.