తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మొన్న ఏనుగు.. నేడు ఆవు.. అసలేమైంది? - హిమాచల్​ప్రదేశ్ బిలాస్​పూర్

కేరళలో మానవతప్పిదంతో ఓ ఏనుగు చనిపోయిన ఘటన మరువకముందే అలాంటి ఉదంతమే మరొకటి వెలుగుచూసింది. హిమాచల్​ప్రదేశ్ బిలాస్​పూర్​లో ఓ చూడి ఆవు దవడ పగిలిపోయి రక్తమోడుతూ వీధుల్లో తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. దీంతో ఆ ఆవు యజమాని గురుదయాళ్​ సింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.​

After pregnant elephant, now cow in Himachal consumes firecracker filled food, injured
మొన్న ఏనుగు.. నేడు ఆవు

By

Published : Jun 6, 2020, 5:36 PM IST

Updated : Jun 6, 2020, 7:01 PM IST

పేలుడు పదార్థాలు కలిగిన పండును తిని ఆ బాధతో ఏనుగు మరణించిన ఘటన మరువక ముందే హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్​లో‌ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈసారి ఆవు ఆ దారుణ పరిస్థితిని ఎదుర్కొంది. బిలాస్‌పూర్‌లోని జన్‌దుత ప్రాంతంలో ఓ గర్భంతో ఉన్న ఆవు దవడ పగిలిపోయి రక్తమోడుతూ వీధుల్లో తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మొన్న ఏనుగు.. నేడు ఆవు.. అసలేమైంది?

దీంతో ఆ ఆవు యజమాని గురుదయాళ్‌ సింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. తన ఇంటి పక్కన ఉండే నందలాల్‌ కావాలనే ఇలా చేశాడని ఆరోపించాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నందలాల్‌ తన ఇంటి నుంచి పరారయ్యాడు. 10రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆవు యజమాని గురుదయాళ్‌ ఫిర్యాదు మేరకు జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:కేంద్రం చర్య డీమానిటైజేషన్​ 2.0. సంకేతమేనా: రాహుల్​

Last Updated : Jun 6, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details