గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణ అనంతరం భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం చైనా పరిధిలోని మోల్డోలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో సైనిక చర్చలు జరిగాయి. అయితే త్వరలోనే దౌత్యస్థాయిలోనూ చర్చలు జరపాలని భారత్-చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల అధికారులు.. ఈ సమావేశానికి సంబంధించిన తేదీని నిర్ణయించే పనిలో పడినట్టు సమాచారం.
ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ భేటీ జరిగే అవకాశముంది.