మహారాష్ట్రలో సీఎం పీఠాన్ని దక్కించుకున్న శివసేన ఇప్పుడు తన దృష్టిని గోవాకు మళ్లించింది. అక్కడ అధికారంలో ఉన్న భాజపా కూటమికి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. గోవాలో భాజపాను వ్యతిరేకించే పార్టీలతో మరో కూటమిని ఏర్పాటు చేయబోతున్నట్లు శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌రౌత్ శుక్రవారం ప్రకటించారు.
గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ) నాయకుడు విజయ్ సర్దేశాయి శుక్రవారం ముంబయిలో రౌత్‌ను కలిసి శివసేనకు మద్దతుగా మాట్లాడారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి చెందిన సుదిన్ ధావలికార్ కూడా భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటు సాధ్యమేనన్నారు.
''గోవాలో కచ్చితంగా భూకంపం పుడుతుంది. సర్దేశాయి తన ఎమ్మెల్యేలతో ఇక్కడ ఉన్నారు. భాజపాకు మద్దతిచ్చిన ఇతర ఎమ్మెల్యేలూ మాతో టచ్‌లో ఉన్నారు.''