కేరళలోని ఎర్నాకులంలో షిగెల్లా వ్యాధి మొదటి కేసు నమోదైంది. చొట్టనిక్కర ప్రాంతంలోని 56 ఏళ్ల మహిళకు బుధవారం ఈ వ్యాధి సోకినట్లు ఆసుపత్రి వర్గాలు నిర్ధరించాయి.
జిల్లాలో మొదటి కేసు నమోదైన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితురాలి ఇంటి సమీపంలోని తాగు నీటి సాంపిళ్లను పరీక్షించింది. స్థానికులు వ్యాధి సంక్రమణ దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యాధి లక్షణాలు, వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.