జమ్ముకశ్మీర్లో అలజడులకు కారణమవుతున్న వేర్పాటువాద సంస్థ 'ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్'ను నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఉగ్రవాద సంస్థ 'జమాతే ఇస్లామీ హింద్'ను ఇప్పటికే నిషేధించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 'హురియత్'పై దృష్టి పెట్టింది. నిఘా సంస్థలు ఇందుకు సంబంధించిన నివేదికలను హోంమంత్రిత్వశాఖకు అందజేశాయి.
''తీవ్రవాద వ్యతిరేక పోరాటం కీలక దశలోకి వచ్చింది. 'హురియత్ కాన్ఫరెన్స్' ఉగ్రవాదానికి మద్దతుగా, వేర్పాటువాద ధోరణులు ప్రదర్శిస్తోంది. అందుకే దేశ ద్రోహానికి పాల్పడుతున్న ఈ సంస్థను నిషేధించడంపై దృష్టి సారించామని'' తెలిపారు హోంమంత్రిత్వశాఖకు చెందిన అత్యున్నతాధికారి.