మధ్యప్రదేశ్ మందసౌర్ జిల్లాలో ఉల్లిధర ఆకాశాన్ని అంటుతోంది. పెరిగిన ధరలతో లాభాన్ని పొందాల్సిన రైతులు ప్రస్తుతం నష్టాలను చవిచూస్తున్నారు. చుక్కలు చూపిస్తున్న ధరలతో కొనలేక అక్కడ ఉల్లి దొంగలు పెరిగిపోవడమే ఇందుకు కారణం.
ఉల్లి చోరీ ఘటన మందసౌర్ జిల్లాలో మంగళవారం జరిగింది. నారాయణ్‌గఢ్ ప్రాంతంలోని రిచా గ్రామంలో పొలం నుంచి సుమారు 6వందల క్వింటాళ్ల ఉల్లి చోరీకి గురైంది. ఈ దొంగతనంతో పొలం యజమాని జితేంద్ర ధన్ఘర్ కన్నీరు పెట్టుకుంటున్నాడు.
"మహారాష్ట్ర నాసిక్ నుంచి విత్తనాన్ని తీసుకొచ్చాం. పంట కోసం ఎంతో శ్రమించాం. పంట చేతికొస్తుందని అనుకున్న సమయంలో ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్లారు. దగ్గర్లో ఉన్న నల్లా వద్ద పైనున్న ఆకులను కత్తిరించి పంటను చోరీ చేశారు. ఒకటిన్నర ఎకరాల పంటకు లక్ష చొప్పున ఖర్చుచేశాం. ఈ దొంగతనం వల్ల పెట్టుబడి వెనక్కి రాకుండా పోయింది."