తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాస్కే బంగారమాయెనే..! ధరెంతో తెలుసా? - mask made of gold

మాస్కు ధర లక్ష పైమాటే... అదేంటీ అంత ఖరీదు ఎందుకు అనుకుంటున్నారా? స్వచ్ఛమైన బంగారంతో చేశారు మరి. మహారాష్ట్రకు చెందిన శంకర్​ అనే వ్యక్తి 55 గ్రాముల పసిడితో చేసిన మాస్కు ధరించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

GOLD MASK
అత్యంత ఖరీదైన మాస్కు

By

Published : Jul 4, 2020, 10:42 AM IST

Updated : Jul 4, 2020, 11:29 AM IST

బంగారం అంటే ఇష్టం ఉండని వారెవరూ? తమ అంతస్తును ప్రదర్శించేందుకు బంగారు ఆభరణాలను ధరిస్తుంటారు. ఇప్పటివరకు కొంతమంది బంగారు చొక్కాలు, కత్తెర వాడటమూ చూశాం. ఇంకొంత మంది కార్లకు బంగారు పూత పూయించినవారు ఉన్నారు.

కానీ, ఈ కరోనా కాలంలో అవసరంతోపాటు ట్రెండింగ్ వస్తువు మాస్క్. అదీ కూడా బంగారంతో చేయించుకున్నాడు ఓ వ్యక్తి. అవునండీ నిజమే.. మహారాష్ట్రలోని పింప్రి-చించ్​వాడ్​కు చెందిన శంకర్​ కుర్హడే.. 55 గ్రాముల స్వచ్ఛమైన పసిడితో చేసిన మాస్కును ధరిస్తున్నాడు. దీని ధర రూ.2.90 లక్షలు.

రూ.2.90 లక్షలతో 55 గ్రాముల బంగారు మాస్క్

ఈ మాస్కును 8 రోజుల్లో తయారు చేశాడు స్వర్ణకారుడు. గాలి పీల్చుకునేందుకు వీలుగా చాలా సన్నగా దీన్ని తయారు చేశాడు. కొల్హాపురీ క్షౌర శాల యజమాని బంగారు కత్తెరలు ఉపయోగించటం చూసి స్ఫూర్తి పొందానని చెబుతున్నాడు శంకర్.

Last Updated : Jul 4, 2020, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details