దిల్లీలో భాజపా, ఆప్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఆమ్ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు 2013లో 3 ఓటరు గుర్తింపు కార్డులుండేవని, ప్రస్తుతం ఆయన భార్యకు 3 ఓటరు ఐడీలున్నాయని ఆరోపించింది భాజపా.
అంతకుముందు తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థి, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు 2 ఓటరు ఐడీలు ఉన్నాయని.. ఆప్ అభ్యర్థిని అటిషి స్థానిక తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల్లో ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించబోయే వ్యక్తికి ఓటేయడం వృథా అని గంభీర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు కేజ్రీవాల్.
ఆప్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన భాజపా.. అర్వింద్ కేజ్రీవాల్‌కు 2013లో 3 ఓటరు గుర్తింపు ఎక్కడివని ప్రశ్నించింది.
''కేజ్రీవాల్‌కు 2013 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు సాహిబాబాద్, సీమాపురి, హనుమాన్ రోడ్లలో ఓటరు ఐడీలున్నాయని అప్పట్లో నేను ఈసీకి ఫిర్యాదు చేశా. దీనిపై కేజ్రీవాల్ ముందు జవాబివ్వాలి.''