తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు కలిసి పోరాడాలి: చైనా - జాతీయ వార్తలు

పాక్​కు ఎఫ్​ఏటీఎఫ్​ హెచ్చరికల నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా నడవాలని చైనా పిలుపునిచ్చింది. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో భారత్​లోని చైనా రాయబారి సున్​ వీయిడాంగ్​ పలు విషయాలపై స్పందించారు.

China

By

Published : Oct 19, 2019, 3:30 PM IST

Updated : Oct 19, 2019, 3:52 PM IST

ఉగ్రసంస్థలకు నిధులు నిలిపివేయాలని పాకిస్థాన్​కు​ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్​ఏటీఎఫ్​) హెచ్చరికల నేపథ్యంలో చైనా స్పందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు కలిసి పోరాడాలని పిలుపిచ్చింది.

భారత్​లోని చైనా రాయబారి సున్​ వీయిడాంగ్​తో ఓ వార్తాసంస్థ నిర్వహించిన ముఖాముఖిలో పలు విషయాలపై స్పందించారు.

"ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేసేందుకు భారత్​, చైనా కట్టుబడి ఉన్నాయి. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి అన్ని దేశాలు సహకరించాలని చైనా అర్జిస్తోంది."

-సున్​ వీయిడాంగ్​, భారత్​లో చైనా రాయబారి

ఈ ఏడాది మొదట్లో ఎఫ్​ఏటీఎఫ్​ అధ్యక్ష బాధ్యతలను చైనా చేపట్టిన వేళ.. పాక్​పై ఆంక్షలు తొలగుతాయని అంతా భావించారు. కానీ ఎఫ్​ఏటీఎఫ్​ సూచించిన ప్రమాణాలను పాటించటంలో పాక్​ విఫలమయింది. ఈ మేరకు అక్టోబర్​ 18న ఎఫ్​ఏటీఎఫ్​లో పాక్​ స్థానంపై ఆ సంస్థ అధ్యక్షుడు జియాంగ్మిన్ లియూ ప్రకటన చేశారు.

"2020 ఫిబ్రవరి లోపు సూచించిన కార్యాచరణను పూర్తి చేయాల్సి ఉంది. మళ్లీ విఫలమయితే బ్లాక్​ లిస్ట్​లో చేర్చాల్సి వస్తుంది. పాక్​ గడ్డపై ఉగ్రవాదులకు చోటు, ఆ సంస్థలకు నిధులను నిలిపివేయాలి."

-జియాంగ్మిన్ లియూ, ఎఫ్​ఏటీఎఫ్ అధ్యక్షుడు

భారత్​ ఆరోపణలు..

సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందని అంతర్జాతీయ వేదికలపై భారత్​ ఎన్నో సార్లు ఆందోళన వ్యక్తం చేసింది. పాక్​లో బాహాటంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రసంస్థల వివరాలను బయటపెట్టింది. పుల్వామా, ఉరీ ఉగ్రదాడుల్లో పాక్​ పాత్రను బహిర్గతం చేసింది. ఉగ్రవాదంపై పాక్​ పోరును కంటితుడుపు చర్యగా భారత్​ అభివర్ణించింది.

భారత్​లో జిన్​పింగ్​ పర్యటనకు ముందు చైనాకు పాక్​ ప్రధాని ఇమ్రాన్​, సైన్యాధ్యక్షుడు ఖమర్​ జావెద్​ బజ్వా వెళ్లారు. ఎఫ్​ఏటీఎఫ్​ బ్లాక్​ లిస్టు ప్రమాదం నుంచి తప్పించాలని అర్థించారు. చైనా కూడా జిన్​జియాంగ్​ రాష్ట్రంలో ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది.

Last Updated : Oct 19, 2019, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details