తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీని పొగిడిన ఎమ్మెల్యేపై సస్పెన్షన్​ వేటు - tamilnadu political news latest

రామమందిర నిర్మాణాన్ని సాధ్యమయ్యేలా చేశారని ప్రధాని నేరంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ఎమ్మెల్యేను సస్పెండ్​ చేసింది డీఎంకే పార్టీ. అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్​ ప్రకటించారు.

After DMK MLA's praise for PM Modi, party suspends him
ప్రధాని మోదీని పొగిడిన ఎమ్మెల్యేపై సస్పెన్షన్​ వేటు

By

Published : Aug 5, 2020, 4:47 PM IST

ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తిన డీఎంకే ఎమ్మెల్యే కుకా సెల్వంపై సస్పెన్షన్​ వేటు వేసింది పార్టీ అధిష్ఠానం. ఆయనను పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

సెల్వం భాజపాలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన దిల్లీలో మంగళవారం పర్యటించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. రామమందిరం నిర్మాణాన్ని సాధ్యమయ్యేలా చేశారని కొనియాడారు.

అయితే తన నియోజకవర్గానికి ప్రాజెక్టులు మంజూరు చేయాలని రైల్వేమంత్రి పీయూష్ గోయల్​ను కలిసేందుకే దిల్లీ వెళ్లానని వివరణ ఇచ్చారు సెల్వం.

తౌసండ్ లైట్ల్​ నియోజకవర్గానికి సెల్వం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సస్పెన్షన్​కు ముందు వరకు డీఎంకే ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా, కార్యనిర్వాహక సభ్యునిగా ఉన్నారు.

ఇదీ చూడండి: 'రాముని అడుగుజాడల్లో నడిస్తే అభివృద్ధి తథ్యం'

ABOUT THE AUTHOR

...view details