తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టార్గెట్​ లాలూ: యాదవుల ఓట్లపై నితీశ్​ గురి - Nitish Kumar Jitan Ram Manjhi alliance

బిహార్​ రాజకీయం రూపు మారుతోందా? శాసనసభ ఎన్నికల వేళ సామాజిక సమీకరణాల్లో అనూహ్య మార్పు వస్తోందా? 1990 నుంచి ఆర్​జేడీకే అండగా నిలుస్తున్న యాదవులు, ముస్లింలు... ఈసారి జేడీయూ వైపు చూస్తున్నారు? ఇందుకోసం నితీశ్​ కుమార్​ అమలుచేస్తున్న వ్యూహాలేంటి?

After Dalits and Muslims, Nitish eyeing RJD's Yadav vote bank
టార్గెట్​ లాలూ: యాదవుల ఓట్లపై నితీశ్​ గురి

By

Published : Sep 11, 2020, 6:10 PM IST

సోషల్​ ఇంజినీరింగ్​... ఆధునిక రాజకీయాల్లో సరికొత్త విజయ రహస్యం. 2014 లోక్​సభ ఎన్నికల్లో భాజపా ప్రభంజన విజయం తర్వాత బాగా ప్రాచుర్యం పొందిన వ్యూహం. ముఖ్యంగా ఉత్తర్​ప్రదేశ్​లో అప్పటివరకు ఎవరి దారి వారిదే అన్నట్టు ఉన్న వేర్వేరు సామాజిక వర్గాలు భాజపావైపు ఆకర్షితులయ్యేలా అమిత్ షా అమలు చేసిన ప్రణాళికలు అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు బిహార్​ శాసనసభ ఎన్నికల వేళ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​. ఏకంగా ప్రత్యర్థి ఓటు బ్యాంకుపైనే గురిపెట్టి... సరికొత్త రాజకీయానికి తెరతీస్తున్నారు.

డి-ఎం-వై ఫార్ములా

బిహార్​ రాజకీయాల్లో దళితులు(డి), ముస్లింలు(ఎం), యాదవులు(వై) ఎంతో కీలకం. రాష్ట్రంలో దాదాపు 50 శాతం ఓట్లు వారివే. ఏ కూటమి అధికారం చేపడుతుందో నిర్ణయించడంలో ఆ మూడు వర్గాలే కీలకం. అందుకే ఆ వర్గాలపై గురిపెట్టారు నితీశ్​.

దళితులు, ముస్లింలను ఆకట్టుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు జేడీయూ అధినేత.

దళిత నేత జితన్​ రామ్​ మాంఝీకి ఓసారి ముఖ్యమంత్రిని చేశారు నితీశ్​. ఉదయ్ నారాయణ్​ చౌదరికి రెండుసార్లు శాసనసభ స్పీకర్​గా అవకాశం ఇచ్చారు. అత్యధిక సంఖ్యలో దళితులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆ వర్గం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఇలాంటి వ్యూహాలతో వారి మనసు గెలుచుకోవడంలో కొంతమేర సఫలమయ్యారు నితీశ్​.

ప్రత్యర్థి బలంపై గురి

ముస్లింలు, యాదవులు ఎప్పటి నుంచో మహాకూటమి(ఆర్​జేడీ-కాంగ్రెస్​)కే మద్దతిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ రెండు వర్గాలపై ప్రత్యేక దృష్టిసారించారు నితీశ్. ప్రధాన ప్రత్యర్థి రాష్ట్రీయ జనతా దళ్​ను ఉక్కిరిబిక్కిరి చేసేలా 'ఆపరేషన్​ ఆకర్ష్'​ అమలు చేస్తున్నారు.

నితీశ్​ వ్యూహంతో ఆర్​జేడీ ఎమ్మెల్యేలు ఏడుగురు జేడీయూలో చేరారు. వీరిలో అత్యధికులు యాదవులు, ముస్లింలే. వీరి రాకతో ప్రత్యర్థి ఓటు బ్యాంకుకు గండిపడి, తమకు ఆయా వర్గాల మద్దతు లభిస్తుందని ఆశిస్తోంది జేడీయూ. అనుకున్నట్టు జరిగితే... ముస్లిం వర్గంపై మంచి పట్టున్న గులామ్​ రసూల్​ బలియావీ వంటి నేతలు జేడీయూలో ఇకపై కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

మరోమారు ఎన్​డీఏ విజయమే లక్ష్యంగా నితీశ్​ అమలుచేస్తున్న ఈ నయా వ్యూహం ఏమేర ఫలిస్తుందో వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details