ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ కోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పుపై స్పందించారు నిర్భయ తల్లి. కోర్టు నిర్ణయంతో ఏడేళ్ల తర్వాత తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని భావోద్వేగానికి గురయ్యారు.
"ఎట్టకేలకు దోషులకు ఉరిశిక్ష అమలు అవుతోంది. కోర్టు నిర్ణయంతో ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది.'