తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూడీఎఫ్​లో చీలిక.. ఎల్​డీఎఫ్​లోకి కేరళ కాంగ్రెస్​(ఎం)

దశాబ్దాలుగా యూడీఎఫ్​తో ఉన్న బంధానికి కేరళ కాంగ్రెస్​(ఎం) స్వస్తి చెప్పింది. కేరళ అధికార పక్ష కూటమి ఎల్​డీఎఫ్​​లో చేరింది. అనంతరం రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ కార్యనిర్వాహక ఛైర్మన్​ జోస్​ కే మణి.

after 38 years kerala congress(m) came out from udf and joined in ldf
కేరళ అధికార పక్ష కూటమితో కేరళ కాంగ్రెస్‌(ఎం) జట్టు

By

Published : Oct 14, 2020, 5:02 PM IST

ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కేరళలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) చీలిపోయింది. యూడీఎఫ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు కేరళ కాంగ్రెస్‌ (ఎం) కార్యనిర్వాహక ఛైర్మన్‌ జోస్‌ కే మణి తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేరళ అధికార వామపక్ష కూటమి లెఫ్ట్‌ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఫ్‌)లో చేరారు. యూడీఎఫ్‌ నుంచి కేరళ కాంగ్రెస్‌(ఎం) దాదాపు 38 ఏళ్ల తర్వాత విడిపోవడం గమనార్హం.

  • యూడీఎఫ్‌ మద్దతుతోనే రాజ్యసభ సభ్యుడిగా జోస్‌ కే మణి ఎన్నికయ్యారు.
  • యూడీఎఫ్‌ కూటమిలో జాతీయ కాంగ్రెస్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, పీజే జోసెఫ్ నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్‌(ఎం), కేరళ కాంగ్రెస్‌ (జాకబ్‌) పార్టీలు ఉన్నాయి.
  • కేరళ కాంగ్రెస్(ఎం)‌లోని తన వైరి వర్గం పీజే జోసెఫ్‌ వర్గానికి యూడీఎఫ్‌ అండగా నిలబడటంతో జోస్‌ కే మణి జీర్ణించుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
  • గతేడాది కేరళ కాంగ్రెస్‌(ఎం) ఛైర్మన్‌ కేఎం మణి (జోస్‌ కె మణి తండ్రి) మృతితో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.

"యూడీఎఫ్‌ శిబిరంలో మా పార్టీ తీవ్రంగా నష్టపోయింది. మేము తీసుకున్న నిర్ణయం తర్వాత కేరళ రాజకీయాలు చాలా మార్పులకు గురికాబోతున్నాయి. "

-- జోస్‌ కే మణి (కేరళ కాంగ్రెస్‌ (ఎం) కార్యనిర్వాహక ఛైర్మన్‌).

కేరళ కాంగ్రెస్‌(ఎం) తరఫున గెలిచిన కొట్టాయం లోక్‌సభ సభ్యుడు థామస్‌ ఛాజికడమ్‌ మాత్రం రాజీనామా చేయబోనని వెల్లడించారు.

కేరళ కాంగ్రెస్‌(ఎం) నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వాగతించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను బలోపేతం చేస్తుందని తెలిపారు. సెంట్రల్‌ ట్రావెన్‌కోర్‌ ప్రాంతంలో కేరళ కాంగ్రెస్‌(ఎం) బలమైన పార్టీ కావడంతో మైనారిటీ ఓట్లను ఆకర్షించవచ్చని అధికార ఎల్‌డీఎఫ్‌ భావిస్తోంది.

ఇదీ చూడండి:భాజపా గూటికి కుష్బూ- లాభం ఎవరికి?

ABOUT THE AUTHOR

...view details