యావత్ భారతావని స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంటే.. ఆ గ్రామం నక్సలైట్ల భయంతో దూరంగా ఉండిపోయింది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న భయాన్ని వదిలి.. ఇవాళ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు ఆ గ్రామస్థులు. జాతి పతాకాన్ని ఎగురువేసి వేడుక జరుపుకున్నారు. మరి ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందామా?
వేడుకకు హాజరవుతోన్న మహిళా కమాండోలు ఛత్తీస్గఢ్లో నక్సలైట్ ప్రభావిత గ్రామాల్లో స్వాతంత్ర్య వేడుకలను ఇప్పటివరకు బహిష్కరించారు. జాతీయ జెండా స్థానంలో నల్ల జెండాలను వినియోగించే వారు. 20 ఏళ్ల తర్వాత తొలిసారి దంతెవాడ జిల్లా కాటెకల్యాన్ బ్లాక్ పరిధిలోని మర్జమ్ గ్రామస్థులు ధైర్యంగా ముందుకొచ్చారు. గ్రామంలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
వర్షంలో గొడుగులతో హాజరైన గ్రామస్థులు ఓ వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ వేడుకల్లో 300 మంది గ్రామస్థులు పాల్గొన్నారు. మహిళా కమాండోలు సహా భద్రతా సిబ్బంది జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రామానికి లొంగిపోయిన నక్సలైట్లు కూడా హాజరయ్యారు.
45 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ పోలీసులు 'ఇంటికి తిరిగి రండి' అనే కార్యక్రమాన్ని ప్రారంభించి... నక్సలైట్లు లొంగిపోయి జనజీవనస్రవంతిలో కలిసేందుకు ప్రోత్సహించారు. పోలీసుల ప్రయత్నానికి విశేష స్పందన లభించింది. ఇప్పటి వరకు 102 మంది నక్సలైట్లు లొంగిపోయారు.
వేడుకలో చిన్నారులు, గ్రామస్థులు ఇదీ చూడండి: ప్రధాని మోదీ స్వాతంత్ర్య ప్రసంగంలో హైలైట్స్ ఇవే...