ఓ ఔత్సాహికుడు తన ఇంటి మిద్దెపై విమానాన్ని డిజైన్ చేశారు. దీన్ని తొలిసారిగా గగనవిహారం చేయించారు. ఇందులో ఆరుగురు కూర్చోవచ్చు. మహారాష్ట్రకు చెందిన కెప్టెన్ అమోల్ యాదవ్ దీన్ని తయారుచేశారు. పూర్తిగా భారత్‌లోనే ఒక విమానాన్ని రూపొందించాలన్న ఉద్దేశంతో ఆయన రెండు దశాబ్దాలుగా కసరత్తు చేస్తున్నారు. ఎట్టకేలకు దీన్ని సాకారం చేశారు. ఓ టెక్నీషియన్ సాయంతో దీనిపై తొలిదశ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అవి అద్భుతంగా సాగాయన్నారు. రెండో దశ పరీక్షల్లో దీన్ని 2వేల అడుగుల ఎత్తులో గగనవిహారం చేయిస్తామన్నారు.
ఇంటి మిద్దెపై విమానం.. ఔత్సాహికుడి ఘనత
మహారాష్ట్రకు చెందిన కెప్టెన్ అమోల్ యాదవ్ తన ఇంటి మిద్దెపై విమానాన్ని డిజైన్ చేశారు. దీన్ని తొలిసారిగా గగనవిహారం చేయించారు. పూర్తిగా భారత్‌లోనే ఒక విమానాన్ని రూపొందించాలన్న ఉద్దేశంతో ఆయన రెండు దశాబ్దాలుగా కసరత్తు చేస్తున్నారు. ఎట్టకేలకు దీన్ని సాకారం చేశారు.
ఇంటి మిద్దెపై విమానం తయారీ.. ఔత్సాహికుడి ఘనత
తొలి దశ పరీక్షల కోసం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గత ఏడాది అనుమతిచ్చింది. విమానంపై పరీక్షల నిర్వహణకు భారీగా బీమా చేయించాల్సి ఉంటుందని, కుటుంబ సభ్యుల సహకారంతో నిధులు సమకూర్చుకున్నానని అమోల్ తెలిపారు.
Last Updated : Aug 16, 2020, 1:04 PM IST