కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పేందుకు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. క్షమాపణ చెబితే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డానని అంగీకరించినట్లవుతుందని పేర్కొన్నారు. తాను నమ్మిన విషయాన్నే ట్వీట్ల రూపంలో వ్యక్తం చేసినట్లు స్పష్టంచేశారు. ఈమేరకు సర్వోన్నత న్యాయస్థానానికి లిఖితపూర్వకంగా తన వివరణను సమర్పించారు భూషణ్.
'ధిక్కరణ'పై క్షమాపణకు ప్రశాంత్ నిరాకరణ - అడ్వకేట్ ప్రశాంత్ భూషన్
కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పేందుకు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. న్యాయస్థానం ఆయనకు మంగళవారం శిక్ష ఖరారు చేసే అవకాశముంది.

కోర్టు ధిక్కరణ కేసులో క్షమాపణలు చెప్పనన్న ప్రశాంత్
జడ్జిలు, కోర్టులపై భూషణ్ ట్వీట్లను సుమోటోగా తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ఈ నెల 14న కోర్టు ధిక్కరణ కేసులో ఆయనను దోషిగా తేల్చింది. బేషరతుగా క్షమాపణ చెబితే శిక్ష ఖరారు విషయంలో ఆలోచిస్తామని పేర్కొంది. క్షమాపణ చెప్పేందుకు ప్రశాంత్ నిరాకరించినందున మంగళవారం శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.