భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ దిల్లీలోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఇంట్లో జెండా ఎగరేసే ఆనవాయితీని అనేక దశాబ్దాలుగా అనుసరిస్తున్నారు అడ్వాణీ.
విష జ్వరంతో బాధపడుతున్నకారణంగా ఈసారి స్వాతంత్ర్య వేడుకల్లో అడ్వాణీ పాల్గొనడం లేదని ఆయన కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గురువారం ఆరోగ్యం కాస్త కుదుటపడినందు వల్ల ఎప్పటిలాగే తన నివాసంలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు అడ్వాణీ. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుల సన్నిహితులు వెల్లడించారు.