అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న భారతీయుల కల నేరవేరుస్తూ.. ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందాయి. అయితే.. అయోధ్యలో రామాలయం కోసం ముందుండి పోరాడిన భాజపా నేతలు లాల్ క్రిష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలకు ఇంకా ఆహ్వానం అందకపోవటం గమనార్హం. ఆహ్వానం అందకపోతే చారిత్రక కార్యక్రమానికి ఇరువురు నేతలు హాజరుకారని వారి సన్నిహత వర్గాల తెలిపాయి.
" చారిత్రక కార్యక్రమానికి మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఆహ్వానం లేకుండా ఆ కార్యక్రమానికి హాజరయ్యే ప్రసక్తే లేదు."
- అడ్వాణీ సన్నిహిత వర్గాలు
ఇలాంటి సమాధానమే ఇచ్చాయి మనోహర్ జోషి సన్నిహిత వర్గాలు.