లోక్సభకు పోటీ చేసే 184 అభ్యర్థులతో భాజపా తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీ అడ్డా నుంచి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేయనున్నారు. దీనిపై అడ్వాణీ మౌనం వహిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 90 ఏళ్లు పైబడిన వయసులో వేరే స్థానం నుంచైనా పోటీ చేస్తారా లేదా అన్నది ప్రాధాన్యం సంతరించుకుంది.
గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి ఆరు సార్లు గెలిచారు అడ్వాణీ. మొదటి సారిగా 1991లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. భాజపాకు వరుసగా విజయాలు అందించిన స్థానాన్ని అమిత్ షాకు కట్టబెడతారని ముందునుంచే ఊహాగానాలు సాగుతున్నాయి. అమిత్ షానే ఇక్కడి నుంచి పోటీ చేయాలని గాంధీనగర్ పరిధిలోని వెజల్పూర్ ఎమ్మెల్యే కిశోర్ చౌహాన్ స్పష్టంగా చెప్పారు.