కశ్మీర్లో రెండు నెలలుగా కొనసాగుతున్న ఆంక్షలపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని విమర్శించారు. ఆంక్షల ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. పాఠశాలలకు విద్యార్థులు వెళ్లకపోవటం వలన స్నేహితులతో సంబంధాలను తెగిపోయాయని, ఇందుకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు ప్రియాంక.
"అభివృద్ధి కోసం విద్యార్థులను పాఠశాలలకు పంపకుండా చేసే ప్రభుత్వాన్ని ఎక్కడైనా చూశారా?"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్వీట్.