వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎయిమ్స్( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), జిప్మర్( జవహార్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు నీట్ తప్పనిసరి కానుంది. ప్రస్తుతం ఎయిమ్స్, జిప్మర్ మినహా మిగిలిన విద్యా సంస్థల్లో నీట్ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు చేపడుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిమ్స్, జిప్మర్ విద్యాసంస్థలు ప్రస్తుతం సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు చేపడుతున్నాయి. 2020 విద్యా సంవత్సరం నుంచి నీట్ పరీక్ష ఆధారంగానే ప్రవేశాలు చేపట్టేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. జాతీయ వైద్య కమిషన్ ప్రకారం అన్ని కళాశాలలను ఒకే ప్రవేశ పరీక్ష కిందకు చేర్చేలా సిద్ధమవుతోంది.
"జాతీయ వైద్య కమిషన్ చట్టం ప్రకారం ఎయిమ్స్, జిప్మర్ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్ ద్వారానే ప్రవేశాలు చేపడతాం. దీని ద్వారా వైద్య విద్యలో దేశంలో ఉమ్మడి ప్రమాణాలు నెలకొల్పే అవకాశం ఉంటుంది. ఒకే పరీక్ష ఉండటం వల్ల విద్యార్థులకు సమయం ఆదా అవుతుంది. వివిధ కౌన్సెలింగ్ ప్రక్రియల్లో పాల్గొనే శ్రమ తగ్గుతుంది. వారి కుటుంబ సభ్యలకు ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. ఒక్కసారినేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పరీక్షలో ఉత్తీర్ణులైతే, ఆ వ్యక్తి లైసెన్స్ పొంది ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లభిస్తుంది. ర్యాంకులు మెరుగుపరుచుకునేందుకు ఎన్నిసార్లు అయినా ఈ పరీక్షను రాసుకోవచ్చు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నామినేట్ చేసిన వారి నుంచి మెడికల్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు అక్టోబర్ 14 న డ్రా నిర్వహిస్తాం."
-హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
నేషనల్ ఎగ్జిట్ టెస్ట్